హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియా పోస్టుల విషయంలో ఆలోచించి కేసు పెట్టాలని సాక్షాత్తూ సుప్రీంకోర్టు సూచించినా, తెలంగాణ ప్రభుత్వం ప ట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కక్ష సాధింపుల కోసం చేసే ఫిర్యాదు లు తీసుకోవద్దని ‘నల్లబాలు వర్సెర్స్ తెలంగా ణ స్టేట్’ కేసును ప్రస్తావిస్తూ.. కర్ణాటక ప్రభు త్వం విడుదల చేసిన గైడ్‌లైన్స్‌ను కూడా తెలంగాణ ప్రభుత్వం అమలుచేయకపోవడం శోచనీయమని అంటున్నారు. సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ‘తెలంగాణ విద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాల నివారణ చట్టం’ భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
సోషల్ మీడియా పోస్ట్‌లకు సంబంధిం చి కేసులు నమోదు చేసే విషయంలో కర్ణాటక పోలీస్ విభాగం నల్లబాలు కేసు మార్గదర్శకాలను అమలు చేస్తూ గత ఫిబ్రవరిలోనే కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ఫేస్బుక్, ఎక్స్, ఇన్ స్టాగ్రామ్ వంటి వేదికలపై పెట్టే పోస్ట్‌ల విషయంలో ఫిర్యాదు రాగానే, ప్రాథమిక వి చారణ లేకుండా యాంత్రికంగా ఎఫ్ఐఆర్లు న మోదు చేయకూడదని మార్గదర్శకాలు జారీ చేశారు. గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను కోర్టు సమర్థించిన నేపథ్యంలో, ఆ నిబంధనలను కర్ణాటకలోనూ అ మలు చేస్తూ ఆ సర్యులర్ విడుదల చేశారు.
అయితే, తాజాగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలో.. సోషల్‌మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. హింసను ప్రేరేపించ డం, ద్వేషాన్ని పెంచడం, ఉద్దేశపూర్వక అవమానం, దేశద్రోహం వంటి ఆరోపణలు సో ష ల్ మీడియాలో వచ్చినప్పుడు హింసను ప్రే రేపించడం లేదా శాంతిభద్రతలకు విఘా తం కలిగించడం వంటి స్పష్టమైన ఆధారాలు ఉంటే తప్ప కేసు నమోదు చేయకూడదని సు ప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇట్లాంటి వ్యవహారాల్లో ‘కేదార్‌నాథ్‌సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్’, ‘శ్రేయాసింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసుల సూత్రాలు పా టించాల్సిందేనని అంటున్నారు. సుప్రీంకోర్టు గతంలో అర్నేష్‌కుమార్ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం.. చిన్నచిన్న కారణాలకే నిందితులను అరెస్ట్ చేయకూడదు. తగిన ఆధారాలు లేని పక్షంలో సెక్షన్-176(1) కింద వెంటనే ఆ ఫిర్యాదులను మూసివేయాలని పలు ఉన్నత న్యాయస్థానాల తీర్పులు స్పష్టంచేస్తున్నాయి.