
మోటకొండూర్, నవంబర్ 16 : సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను ఆయా గ్రామాల టీఆర్ఎస్ నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. ఇక్కుర్తి గ్రామానికి చెందిన కానుగు రాజుకు రూ.55వేలు, రాజబోయిన సంతోష్‌కు రూ. 26వేలు, తేర్యాలకు చెందిన అంబోజు ఉపేందర్‌కు రూ.60వేల చెక్కులను అందించారు. కార్యక్రమాల్లో ఇక్కుర్తి సర్పంచ్ చామకూర అమరేందర్‌రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ బొబ్బలి యాదిరెడ్డి, బీసీ సెల్ మండలాధ్యక్షుడు మల్గ గౌరయ్య, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు బోడ మహేశ్, మాజీ వైస్ ఎంపీపీ బాల్ద లింగం, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఉమాశంకర్, సెక్రటరీ జనరల్ మెహన్గౌడ్, నాయకులు చొప్పరి మొగులయ్య, రాణువ నర్సింహారావు పాల్గొన్నారు.
బొమ్మలరామారం : మండలంలోని ఫక్కీర్గూడకు చెందిన బొబ్బిలి చంద్రకళకు రూ.60వేలు, బొబ్బిలి కవితకు రూ.50వేలు సీఎం సహాయ నిధి నుంచి మంజూరయ్యాయి. ఆ చెక్కులను సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మేడబోయిన గణేశ్ మంగళవారం లబ్ధిదారులకు అందజేశారు. ఉపసర్పంచ్ బొబ్బిలి అంజిరెడ్డి, ఎంపీటీసీ బోయిని లత, నర్సింహ, అశోక్, శ్రీనివాస్, కిష్టయ్య, చాణక్యరెడ్డి, రాంచందర్ పాల్గొన్నారు.