SAW vs BANW : బంగ్లాదేశ్ స్పిన్నర్లను కాచుకొని అర్ధశతకంతో జట్టును గెలుపు దిశగా నడిపిస్తున్న మరినే కాప్ (56) ఔటయ్యింది. 40 వ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో గేర్ మార్చిన కాప్.. ఆ తర్వాత నహిదా అక్తర్ ఓవర్లో ఆమె లాంగాఫ్‌లో పెద్ద షాట్ ఆడబోయి షొర్నా చేతికి దొరికింది. దాంతో.. ఆరో వికెట్ 85 పరుగుల కీలక భాగస్వామ్యానికి తెరపడింది.
ఓవైపు బంగ్లా స్పిన్నర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు సంధిస్తున్న వేళ.. టీమిండియాపై విధ్వంసక ఆటతో రెచ్చిపోయిన డీక్లెర్క్(8)పై సఫారీ టీమ్ భారీ ఆశలు పెట్టుకుంది. క్రీజులో కుదురుకున్న చోలే ట్రయాన్ (40).. డీక్లెర్క్ ఇద్దరిలో ఒకరిని ఔట్ చేసినా బంగ్లా విజయానికి చేరువవుతుంది. 42 ఓవర్లకు స్కోర్.. 172-6. ఇంకా విజయానికి 61 రన్స్ కావాలి.
A priceless partnership for South Africa as Marizanne Kapp brings up an important half-century. 71 to get off the last 10 overs #CWC25
Follow LIVE ▶️ https://t.co/aK9P2NlYro pic.twitter.com/jZWtMptBrD
— ESPNcricinfo (@ESPNcricinfo) October 13, 2025
పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన దక్షిణాఫ్రికా స్వల్ప లక్ష్య ఛేదనలో అపసోపాలు పడుతోంది. వైజాగ్‌లో బంగ్లాదేశ్ స్పిన్నర్లు విజృంభించడంతో పరుగుల కోసం చెమటోడ్చుతున్నారు సఫారీ బ్యాటర్లు 15వ ఓవర్లో లారా వొల్వార్డ్త్ (31) రనౌట్‌తో మొదలు.. ఆరు పరుగుల తేడాతో మూడు వికెట్లు కోల్పోయింది సఫారీ జట్టు. బంగ్లా స్పిన్నర్ ఫాహిమా ఖాతూన్ తొలి బంతికే సినాలో జాఫ్తా(4)ను బౌల్డ్ చేసి ఐదో వికెట్ అందించింది. వరసగా వికెట్లు పడిన దశలో మరినే కాప్ (56), చొలే ట్రయాన్(40 నాటౌట్)లు ఓపికగా ఆడుతూ స్కోర్ బోర్డును నడిపించారు. చకచకాగా సింగిల్స్ తీస్తూ.. స్ట్రయిక్ రొటేట్ చేస్తూ స్కోర్ 130 దాటించారు. 40వ ఓవర్లో సిక్స్, ఫోర్‌తో మరినే హాఫ్ సెంచరీ సాధించింది. 85 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన మరినే కాప్‌ను నహిదా పెవిలియన్ పంపింది. దాంతో.. 163 వద్ద ఆరో వికెట్ పడింది.