Nagole Murder Case | హైదరాబాద్ నాగోల్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జేకే మహేష్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడే అని తేలింది. ఏ మాత్రం భయం లేకుండా ‘ప్రభుత్వ వాహనం’ అని బోర్డు ఉన్న కారులో వచ్చి హత్యకు పాల్పడటం చర్చనీయాంశంగా మారింది.
నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ఆనంద్‌నగర్ చౌరస్తా సమీపంలో సోమవారం రాత్రి రౌడీషీటర్ మహమ్మద్ నయీమ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ఇల్లెందుకు చెందిన రౌడీషీటర్ ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. మహేష్‌తో పాటు మరో ఐదుగురు ఈ హత్యలో పాల్గొన్నట్లు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు.
అయితే జేకే మహేష్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావువ అనుచరుడే అని తెలిసింది. మంత్రి తుమ్మల కొడుకు యుగంధర్‌కు అనుచరుడిగా ఉంటూ.. రౌడీషీటర్‌గా చలామణీ అవుతున్నాడు. ఇక దీపదాస్ మున్షీ మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో అతను కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ నాయకుడు మువ్వా విజయ్ బాబుతో కూడా అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, కాంగ్రెస్ నాయకులతో కలిసి రౌడీ రాజకీయాలు చేస్తాడని సమాచారం. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
బిగ్ బ్రేకింగ్ న్యూస్
నాగోల్‌లో మర్డర్ చేసింది మంత్రి తుమ్మల అనుచరుడే
ఏ మాత్రం భయం లేకుండా “ప్రభుత్వ వాహనం” అని బోర్డు ఉన్న కారులో వచ్చి హత్య
నాగోల్ హత్య కేసులో బయటపడ్డ సంచలన విషయాలు
ప్రధాన నిందితుడు జేకే మహేష్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడిగా గుర్తింపు
నాగోల్ పోలీస్… https://t.co/3FcFnMRtSk pic.twitter.com/69Q5wpzRK9
— Telugu Scribe (@TeluguScribe) September 16, 2026