వచ్చే ఏడాది డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు నాగచైతన్య. ‘మనం’ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఆయన ఓ వెబ్‌సిరీస్ చేస్తున్నారు. టైమ్ ట్రావెల్ కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఇందులో నాగచైతన్య పాత్రికేయుడిగా కనిపించబోతున్నట్లు తెలిసింది. రెండు షేడ్స్‌లో ప్రయోగాత్మకంగా ఆయన పాత్ర సాగుతుందని చెబుతున్నారు. తమిళ నటి ప్రియాభవానీ శంకర్ కథానాయికగా నటిస్తున్నట్లు తెలిసింది.. త్వరలో షూటింగ్ ప్రారంభంకానున్నట్లు సమాచారం.