Couple Friendly | టాలీవుడ్ యాక్టర్ సంతోష్ శోభన్, మానస వారణాసి కాంబోలో వస్తున్న మూవీ ‘కపుల్ ఫ్రెండ్లీ’. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్బ్యానర్పై తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. కాగా ఈ మూవీని వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు మేకర్స్. సన్‌లైట్‌లో హీరోహీరోయిన్లు రొమాంటిక్ మూడ్‌లో ఉన్న లుక్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ నాలో నేను వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. వర్షంలో తడిసి ఇంటికి వచ్చిన సంతోష్ శోభన్, మానస వారణాసి మధ్య సాగే సన్నివేశాల నేపథ్యంలో రొమాంటిక్ ఫీల్‌తో ఈ పాట ఉండబోతున్నట్టు విజువల్స్ చెబుతున్నాయి. ఈ పాటను సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రాయగా.. సంజిత్ హెగ్డే పాడాడు. కపుల్ ఫ్రెండ్లీ మూవీకి అజయ్ కుమార్ రాజు పీ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన టీజర్ మిడిల్ క్లాస్ కష్టాల నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేస్తుంది. టీజర్లో నెల్లూరు కుర్రాడైన శివ (సంతోష్ శోభన్) ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తూ, సరైన ఉద్యోగం లేక చెన్నైలో కష్టాలు పడుతుంటాడు.
ఖర్చుల కోసం బైక్ పూలింగ్(రాపిడో లాంటివి) చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ప్రీతి (మానస వారణాసి) అతని బైక్‌లో ప్రయాణిస్తుంది. అలా అనుకోకుండా కలిసిన ఈ ఇద్దరూ ఆ తర్వాత ఎలా ప్రేమలో పడతారు..? ఆ తర్వాత ఏం జరిగింది..? అనే నేపథ్యంలో సినిమా ఉండబోతున్నట్టు టీజర్ ద్వారా హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్.
Chemistry is never accidental. It was always meant to be ❤🔥#CoupleFriendly First Single video song out now 🫶#NaaloNenu (Telugu) ▶️ https://t.co/cUtoMGWdmT #CoupleFriendly in cinemas worldwide on FEBRUARY 14th in Telugu and Tamil ❤️@santoshsoban @varanasi_manasa… pic.twitter.com/I0O8G6MOZd
— BA Raju’s Team (@baraju_SuperHit) January 11, 2026
Jaya Krishna | ఘట్టమనేని వారసుడి తొలి అడుగు .. థ్యాంక్యూ బాబాయ్ అంటూ జయకృష్ణ భావోద్వేగ ప్రసంగం