హనుమకొండ చౌరస్తా : మహిళలు, పిల్లలపై జరుగుతున్న హింస, అక్రమ రవాణా నివారణ కోసం మై ఛాయిస్ ఫౌండేషన్ ( My Choice Foundation ) పనిస్తుందని స్టేట్ కోఆర్డినేటర్ జన్ను క్రాంతి ( Jannu Kranthi ) తెలిపారు. శనివారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సంస్థ తన కార్యక్రమాలను ఆపరేషన్ పీస్ మేకర్( Peace Maker ) , ఆపరేషన్ రెడ్ అలర్ట్ ద్వారా అమలు చేస్తోందని తెలిపారు.
ఆపరేషన్ పీస్ మేకర్ గృహ హింసను నివారించడంపై దృష్టిపెట్టి, సురక్షితమైన కుటుంబ వాతావరణాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. అవగాహన, కౌన్సెలింగ్ సహాయం, న్యాయ-సామాజిక సేవలకు అనుసంధానం అందిస్తుందని, గృహ హింసకు జాతీయ హెల్ప్‌లైన్ 9333404141 అందుబాటులో ఉందన్నారు. ఆపరేషన్ రెడ్ అలర్ట్ పిల్లల అక్రమ రవాణా నివారణకు సమాజంలో అవగాహన కల్పిస్తుందని, సేఫ్ విలేజ్ కార్యక్రమాల ద్వారా కుటుంబాలు, యువతను అప్రమత్తం చేస్తుందన్నారు.
ట్రాఫికింగ్‌కు సంబంధించిన సహాయానికి టోల్-ఫ్రీ హెల్ఫ్‌లైన్ 1800-419-8588 అందుబాటులో ఉందన్నారు. ఈ సమావేశంలో సీనియర్ కౌన్సిలర్ ఎం.రత్నశ్రీ, సెంటర్ కో ఆర్డినేటర్ జి.రీనా, అసిస్టెంట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ బి.మౌనిక, ప్రోగ్రాం కోఆర్డినేటర్ వి.భువన, ఫీల్డ్ ట్రైనర్ మహంతి, తదితరులు పాల్గొన్నారు.