కోరికలో నిజాయితీ ఉండాలి

- చట్టాలపై అవగాహన ఉంటే కోర్టులతో పనే ఉండదు
- లీగల్ సర్వీసెస్ క్యాంప్‌లో హైకోర్టు జడ్జి జస్టిస్ సుమలత
మారేడ్‌పల్లి, నవంబర్ 13: కోరికల్లో నిజాయితీ ఉంటే అవి నెరవేరే అవకాశాలు అధికంగా ఉంటాయని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుమలత అన్నారు. ప్రజలకు చట్టాలపై అవగాహన ఉంటే, కోర్టులకు వెళ్లే అవసరమే ఉండదని పేర్కొన్నారు. శనివారం సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ, మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా ప్యాట్నీ సెంటర్లో నిర్వహించిన లీగల్ సర్వీసెస్ క్యాంపులో ఆమె మాట్లాడుతూ.. ఉచిత న్యాయసేవలు, చట్టాలపై అవగాహన, ప్రజలకు పథకాలు అందేలా కృషి చేస్తున్న న్యాయసేవాధికార సంస్థను అభినందించారు. రూ.2 కోట్ల విలువైన ఎస్సీ కార్పొరేషన్ రుణాలతోపాటు కులాంతర వివాహం చేసుకున్న 40 జంటలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. భగవాన్ మహావీర్ వికలాంగ ట్రస్ట్ ఆధ్వర్యంలో 15 మంది దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను అందించారు. మహిళలకు సబ్సిడీ రుణాలు, నిరుద్యోగులకు సరుకు రవాణా వాహనాలు, ఆటోలు, దివ్యాంగులశాఖ ఆధ్వర్యంలో మూడు చక్రాల సైకిళ్లు, సబ్సిడీ రుణాలు, ఆర్థిక సాయాన్ని అందజేశారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు కార్మికుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రూ.6.5 లక్షలు చొప్పున పరిహారాన్ని అందించారు. మెటర్నిటీ రిలీఫ్ కింద లబ్ధిదారులకు రూ.30 వేలు, భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారు. హైదరాబాద్‌లో వ్యాక్సినేషన్ వేగంగా పూర్తి చేయించేందుకు కృషి చేసిన డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటిని అభినందించారు. కార్యక్రమంలో సివిల్, మెట్రో పాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చైర్మన్లు ప్రభాకర్‌రావు, జడ్జి సురేశన్, ఫస్ట్ అడిషనల్ కోర్టు జడ్జి ఎన్వీ నాథ్‌రెడ్డి, హైదారబాద్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, సిటీ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగం నారాయణ, సీపీ అంజనీకుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

