Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Mushfiqur Rahim | బంగ్లాదేశ్ (Mushfiqur Rahim) సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim) టెస్ట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్లో 7000 పరుగులు పూర్తిచేసిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ (Westindies) తో సిల్హెట్ వేదికగా ఈరోజు ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో ముష్ఫికర్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.
Mushfiqur Rahim : బంగ్లాదేశ్ (Mushfiqur Rahim) సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ (Mushfiqur Rahim) టెస్ట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఫార్మాట్లో 7000 పరుగులు పూర్తిచేసిన తొలి బంగ్లాదేశ్ క్రికెటర్‌గా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ (Westindies) తో సిల్హెట్ వేదికగా ఈరోజు ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో ముష్ఫికర్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.
రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టుకు దూరంగా ఉన్న 39 ఏళ్ల ముష్ఫికర్.. రెండో టెస్టులో బరిలోకి దిగాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు అతను 7000 పరుగుల మార్క్‌కు 43 పరుగుల దూరంలో ఉన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 34 పరుగులు చేసి అవుటయ్యాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో మ్యాచ్ ఐదోరోజు ఆటలో భాగంగా రోస్టన్ చేజ్ బౌలింగ్‌లో ఒక సింగిల్ తీసి 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఈ చారిత్రక మైలురాయిని అందుకున్నాడు.
ఈ ఇన్నింగ్స్‌లో 49 పరుగులు చేసి అతను నాటౌట్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 369 పరుగుల లక్ష్యఛేదనలో 184/4 స్కోరు వద్ద ఉండగా వెలుతురు మందగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. దాంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో 5000, 6000 పరుగుల మైలురాళ్లను కూడా తొలుత అందుకున్నది ముష్ఫికర్ రహీమే కావడం గమనార్హం. ప్రస్తుతం రహీమ్ 7000 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
రెండో స్థానంలో ఉన్న మోమినుల్ హక్ (5293) కంటే 1747 పరుగులు, ఇప్పటికే రిటైరైన తమీమ్ ఇక్బాల్ (5134) కంటే 1906 పరుగులు ఆధిక్యంలో రహీమ్ కొనసాగుతున్నాడు. 2005లో లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌పై టెస్టు అరంగేట్రం చేసిన ముష్ఫికర్ రహీమ్, బంగ్లాదేశ్ తరఫున అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 107 టెస్టులు ఆడిన అతను, దేశం తరఫున 100 టెస్టులు పూర్తి చేసిన ఏకైక ఆటగాడు.
ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన ముష్ఫికర్ కేవలం టెస్టు క్రికెట్లో మాత్రమే బంగ్లాదేశ్‌కు తన సేవలు అందిస్తున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mushfiqur Rahim | టెస్టు క్రికెట్లో చరిత్ర సృష్టించిన బంగ్లా బ్యాటర్ ముష్ఫికర్..!
Garividi Lakshmi OTT | ఓటీటీలోకి వస్తున్న ‘గరివిడి లక్ష్మి’.. ఆనంది నటించిన బయోపిక్ ఎక్కడ చూడొచ్చంటే?
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
Rahul Gandhi: దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

