Rahul Gandhi: దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్
Rahul Gandhi: దిమాగీ నక్సల్స్ అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు విపక్ష నేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. సీఆర్పీఎఫ్ జవానులారా.. ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారని, అది మీ ముఖంలో కనిపించిందన్నారు. ప్రధాని మోదీ మనల్ని నక్సల్స్ అని పిలిచారని ఆరోపించారు.
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం తన దీపావళి వేడుకలను చత్తీస్‌ఘడ్‌లోని బస్తర్ జిల్లాలో జరుపుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఆయన సీఆర్పీఎఫ్ జవాన్లతో మాట్లాడుతూ దేశంలో సాయుధ నక్సల్స్ అంతం అయ్యారని, కానీ దిమాగీ నక్సల్స్ మాత్రం సంస్థల్లో, రాజకీయ పార్టీల్లో ఉన్నారంటూ ఆరోపించారు. అయితే ఆ వ్యాఖ్యలకు ఇవాళ విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కౌంటర్ ఇచ్చారు. ఆయన తన ఎక్స్ అకౌంట్లో ఓ పోస్టు పెట్టారు. ప్రియమైన సీఆర్పీఎఫ్ జవానులారా.. ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారని, అది మీ ముఖంలో కనిపించిందన్నారు. మనల్ని ప్రధాని మోదీ నక్సల్స్ అని పిలిచారని ఆరోపించారు. కానీ ఈ అంశంలో తన ఛాలెంజ్ మారదన్నారు. ఎవరు దేశ వ్యతిరేకులో తేల్చేందుకు ప్రధాని తనతో చర్చకు రావాలన్నారు. విదేశీ శక్తులు ఎవర్ని నియంత్రిస్తున్నాయో తెలుస్తాయన్నారు. ఎక్కడైనా, ఎప్పుడైనా ఈ అంశంపై చర్చిస్తానని రాహుల్ సవాల్ చేశారు. ఆ చర్చ ముగిసిన తర్వాత .. జవాన్ల ముందు మోదీ తల ఎత్తుకుని నిలబడలేరని గ్యారెంటీ ఇస్తున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Dear @crpfindia,
Your faces said it all: you didn’t buy the PM’s lies.
He called us Naxals.
My challenge stands. Let him debate me on who is anti-national and who is controlled by foreign forces. Any time, any place.
My guarantee: after the debate, the PM won’t have the guts to stand in front of a single jawan again.
प्रिय @crpfindia के जवानों,
आपके चेहरों ने सब बता दिया – आपको प्रधानमंत्री के झूठ पर भरोसा नहीं।
उन्होंने हमें नक्सली कहा।
मेरी चुनौती क़ायम है। वो मुझसे बहस करें – देशद्रोही कौन है और विदेशी ताक़तों के इशारे पर कौन चल रहा है। कोई भी समय, किसी भी जगह।
मेरी गारंटी: उस बहस के बाद प्रधानमंत्री में एक भी जवान के सामने खड़े होने की हिम्मत नहीं होगी।
— Rahul Gandhi (@RahulGandhi) November 9, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- CRPF
- Dimagi Naxals
- Naxals
- Pm Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
Rahul Gandhi: దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
Itllu Arjuna | ‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ ఈవెంట్‌కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కింగ్ నాగార్జున, అఖిల్ కూడా సందడి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

