న్యూఢిల్లీ: కమీడియన్ మునావర్ ఫారుకి షో నిర్వహణకు ఢిల్లీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆగస్టు 28వ తేదీన ఢిల్లీలో మునావర్ కామిడీ షో జరగాల్సి ఉంది. అయితే ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన లైసెన్సింగ్ యూనిట్ ఆ షోకు పర్మిషన్ ఇవ్వలేదు. షో నిర్వహణతో మతసామరస్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. షోను రద్దు చేయాలని వీహెచ్‌పీ పోలీసులకు లేఖ రాసింది. భజరంగ్ దళ్‌తో కలిసి నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు వీహెచ్‌పీ తెలిపింది. అయితే కొన్ని రోజుల క్రితం బెంగుళూరులోనూ మునావర్ షోకు పర్మిషన్ దక్కలేదు. కానీ హైదరాబాద్‌లో జరిగిన షోకు మాత్రం అనుమతి కల్పించారు. ఆ షోను రద్దు చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆయన విడుదల చేసిన ఓ వీడియో వివాదం క్రియేట్ చేసింది. దీంతో ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.