ముంబై: భవిష్యత్తు దృష్ట్యా యువ ఆటగాళ్లను కొనుగోలు చేసుకున్న తమ జట్టు ప్రస్తుతం సంధి దశలో ఉందని ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 15వ సీజన్లో ఆడిన తొలి ఐదు మ్యాచ్‌ల్లోనూ ఓటమి పాలైన ముంబై.. ఇప్పటి వరకు బోణీ కొట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ మాట్లాడుతూ.. ‘తాజా వేలంలో వచ్చే నాలుగైదేండ్ల కోసం జట్టును ఎంపిక చేసుకున్నాం. ఇప్పుడు కాస్త వెనుకబడ్డట్లు కనిపించినా.. రాబోయే రోజుల్లో అత్యుత్తమ క్రికెటర్లను తప్పక చూస్తారు’ అని అన్నాడు.