ముంబై: ముంబైలోని లలిత్ ఫైవ్ స్టార్ హోటల్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. 5 కోట్లు ఇవ్వాలని ఓ కాలర్ డిమాండ్ చేశాఢు. హోటల్లోని నాలుగు ప్రదేశాల్లో బాంబులు అమర్చామని, డబ్బులు ఇవ్వకుంటే పేల్చేస్తామంటూ సోమవారం బెదిరింపు కాల్ వచ్చింది. అయితే హోటల్లో సెక్యూర్టీ చెకింగ్ జరిగిన తర్వాత ఆ బెదిరింపు కాల్ ఉత్తదే అని పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు బుక్ చేసి విచారణ చేపట్టారు.