హైదరాబాద్ : రాజ్యసభలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా , పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నియమితులైన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ( MP Vaddiraju ) పార్టీ అధినేత కేసీఆర్ ( KCR ) ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు రాసిన లేఖను కేసీఆర్ ఎంపీ వద్దిరాజుకు అందజేశారు. తనకు రాజ్యసభ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్‌గా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నియమించినందుకు పార్టీ అధినేతకు వద్దిరాజు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ ని కేసీఆర్ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.