Ori Nayano | హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘ఓరి నాయనో’ చిత్రం!
Ori Nayano | తెలుగు ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన చిత్రాన్ని అందించేందుకు ‘ఓరి నాయనో’ సిద్ధమవుతోంది. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్. సాయి అభిషేక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణి తేజ గొంది దర్శకత్వం వహిస్తున్నారు.
Ori Nayano | తెలుగు ప్రేక్షకులకు మరో ఆసక్తికరమైన చిత్రాన్ని అందించేందుకు ‘ఓరి నాయనో’ సిద్ధమవుతోంది. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎస్. సాయి అభిషేక్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణి తేజ గొంది దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ శుభముహూర్తంలో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి ముహూర్తపు షాట్‌కు తొలి క్లాప్ కొట్టి చిత్రీకరణను ప్రారంభించగా, ‘పొలిమేర’ ఫ్రాంచైజీ చిత్రాలతో గుర్తింపు పొందిన ప్రముఖ దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ తొలి సన్నివేశానికి దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత వంశీ నందిపాటి మాట్లాడుతూ, చిత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశాలతో తెరకెక్కే ఈ సినిమా మంచి విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. నిర్మాత సాయి అభిషేక్ మాట్లాడుతూ, సినిమా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అత్యుత్తమ నిర్మాణ విలువలతో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే తమ లక్ష్యమని, కేవలం 25 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేసి వచ్చే ఫిబ్రవరి నెలలో సినిమాను విడుదల చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని వెల్లడించారు. దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ తన మిత్రుడు చేపట్టిన ఈ నూతన ప్రయత్నానికి అభినందనలు తెలియజేస్తూ చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.
దర్శకుడు మణి తేజ గొంది మాట్లాడుతూ, తన హృదయానికి దగ్గరైన ఈ కథను ప్రేక్షకులకు వినోదాన్ని అందించేలా మరియు గుర్తుండిపోయే పాత్రలతో రూపొందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ‘Every life will have Ori.. Nayano! Moment’ అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో వినోదం మరియు భావోద్వేగాలకు ప్రాధాన్యతనిస్తూ ఈ చిత్రం తెరకెక్కుతోంది. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా డా. ప్రవీణ్ రెడ్డి, సుధీర్ అంకుశం వ్యవహరిస్తుండగా.. శ్రీనివాస్ గవి రెడ్డి, విష్ణు ఓయి, మహేష్ దత్తా, శ్రీకాంత్ రెడ్డి, మైఖేల్ బెన్నీ, గాయత్రి చాగంటి, ఆర్నా ముల్లర్, మురళీధర్ గౌడ్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి సుభాష్ నాథన్ డీవోపీగా, గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా, అర్జున్ సూరిశెట్టి ఆర్ట్ డైరెక్టర్‌గా, అశోక్ దయ్యాల పీఆర్ఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ori Nayano | హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘ఓరి నాయనో’ చిత్రం!
Watch: ఐఎన్ఎస్ విక్రాంత్‌పై.. రాఫెల్ మెరైన్ తొలి ల్యాండింగ్ అండ్ టేకాఫ్
Heavy Rain | హైదరాబాద్‌లో భారీ వర్షం, జలమయమైన రోడ్లు.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
Eligible Graduate | అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి
Water Wastage | మరి ప్రభుత్వానికి ఎవరు ఫైన్ వేయాలి.. ? ఎస్ఆర్ నగర్లో నీటి వృధాపై యువకులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

