Watch: ఐఎన్ఎస్ విక్రాంత్‌పై.. రాఫెల్ మెరైన్ తొలి ల్యాండింగ్ అండ్ టేకాఫ్
Rafale Marine lands on INS Vikrant | భారత స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రాఫెల్ మెరైన్ యుద్ధ విమానం తొలిసారి ల్యాండ్ అయ్యింది. తొలి ప్రయత్నంలోనే ల్యాండింగ్, టేకాఫ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
న్యూఢిల్లీ: భారత స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రాఫెల్ మెరైన్ యుద్ధ విమానం తొలిసారి ల్యాండ్ అయ్యింది. తొలి ప్రయత్నంలోనే ల్యాండింగ్, టేకాఫ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. దీంతో రాఫెల్ మెరైన్ ఫైటర్‌ను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టే కసరత్తు ఊపందుకున్నది. (Rafale Marine lands on INS Vikrant) అక్టోబర్ 29న గోవాలో రాఫెల్ మెరైన్ యుద్ధ విమానానికి సంబంధించిన పరీక్షలను భారత నౌకాదళం నిర్వహించింది. భారత స్వదేశీ ఎయిర్‌క్రాఫ్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్‌పై రాఫెల్ మెరైన్ యుద్ధ విమానం తొలిసారి విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత టేకాఫ్ తీసుకున్నది. దీంతో ఈ విమానాన్ని భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టేందుకు కీలక ముందడుగు పడింది. ఈ వీడియో క్లిప్‌ను భారత నౌకాదళం విడుదల చేసింది.
కాగా, ఇండియన్ నేవీ కోసం 26 రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలను ఫ్రాన్ నుంచి కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించింది. 2025 ఏప్రిల్ 28న సుమారు రూ. 63,000 కోట్ల విలువైన ఈ ఒప్పందంపై ఇరు దేశాల మధ్య సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా 22 సింగిల్ సీట్ ఫైటర్ విమానాలు, 4 ట్విన్ సీట్ ట్రైనర్ విమానాలతో పాటు, ఆయుధాలు, సిమ్యులేటర్లు, శిక్షణ, సంబంధిత పరికరాలు, లాజిస్టిక్ మద్దతును ఫ్రాన్స్‌కు చెందిన రక్షణ రంగ సంస్థ సమకూర్చనున్నది. 2030 నాటికి రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల సరఫరా పూర్తవుతుందని భావిస్తున్నారు. ఈ విమానాలు నడిపే సిబ్బందికి దేశంతో పాటు ఫ్రాన్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు.
A Rafale Marine aircraft successfully landed onboard #IndianNavy’s indigenous Aircraft Carrier #INSVikrant on its maiden attempt on 29 Oct 26.
The ongoing trials mark the first steps towards operationalisation of the aircraft in the #IndianNavy. https://t.co/gIZ0h3nl80
— SpokespersonNavy (@indiannavy) October 30, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ori Nayano | హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘ఓరి నాయనో’ చిత్రం!
Watch: ఐఎన్ఎస్ విక్రాంత్‌పై.. రాఫెల్ మెరైన్ తొలి ల్యాండింగ్ అండ్ టేకాఫ్
Heavy Rain | హైదరాబాద్‌లో భారీ వర్షం, జలమయమైన రోడ్లు.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం
Eligible Graduate | అర్హులైన ప్రతి పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి
Water Wastage | మరి ప్రభుత్వానికి ఎవరు ఫైన్ వేయాలి.. ? ఎస్ఆర్ నగర్లో నీటి వృధాపై యువకులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

