హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరస్టై ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సినీ నటి హేమను మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నుంచి సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు గురువారం వెల్లడించారు.
పోలీసుల నివేదికలో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని, ఆమెకు క్లీన్చిట్ వచ్చేంతవరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఆయన ‘మా’ సభ్యులకు తెలిపారు. డ్రగ్స్ కేసుపై వివరణ ఇవ్వాలని హేమను కోరినప్పటికీ ఆమె నుంచి స్పందన లేకపోవడంతో ‘మా’ సస్పెన్షన్ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలిసింది.