
తల్లిని ప్రేమిస్తున్నామంటూ ఆ ఇంటికి వచ్చిన కొందరు.. ఆ ఇంట్లో ఉన్న మైనర్ బాలికపై కన్నేశారు. ఆ తర్వాత ఆ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత కూడా ఆమెపై ఈ అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఆ 17 ఏళ్ల బాలిక గర్భం దాల్చింది.
ఇటీవల ఆమెకు ఆస్పత్రిలో డెలివరీ అయింది. ఆమె మైనర్ కావడంతో ఆస్పత్రి వర్గాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించి బాధితురాలి తల్లి సహా నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో వెలుగు చూసింది.
మీనంబాల్ నగర్‌కు చెందిన దురైరాజ్‌ను నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. బాలిక తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకున్న అతను.. చాలాసార్లు వాళ్ల ఇంటికి వెళ్లేవాడని, ఆ సమయంలోనే అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిసింది. దర్యాప్తు సమయంలో తనపై దురైరాజ్తోపాటు జమాల్, బషీర్, మరికొంత మంది కూడా అత్యాచారం చేసినట్లు మైనర్ బాలిక వెల్లడించింది.