కమాన్ పూర్ : కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన నారగోని సతీష్ గౌడ్ మదర్ థెరిస్సా అవార్డుకు ఎంపికైనట్లు వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్ ‘వసుంధర విజ్ఞాన వికాస మండలి’ వ్యవస్థాపక అధ్యక్షుడు చదువు వెంకట్ రెడ్డి తెలియజేశారు. నారగోని సతీష్ ఎందరో బాధితులకు తమ హెల్పింగ్ హాండ్స్ ద్వారా సభ్యుల సహకారంతో లక్షలాది రూపాయల ఆర్థిక చేయోత అందించారు.
ఇప్పటివరకు ఆపదలో ఉన్నమంటూ బాధిత కుటుంబసభ్యులు సంప్రదించడంతోనే హెల్పింగ్ హాండ్స్ వాట్సాప్ గ్రూప్లో బాధితుల సమస్యను ప్రతిబింబిస్తూ సభ్యులకు సమాచారం చేరవేస్తారు. వారి నుంచి ఆర్థిక సాయాన్ని సేకరించి బాధిత కుటుంబసభ్యులకు అందజేస్తారు. ఈ ప్రక్రియను గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. సామాజిక సేవా దృక్పథంతో ఏర్పాటుచేసిన హెల్పింగ్ హాండ్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఎన్నో కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు.
సామాజిక రంగంలో చేస్తున్న సేవలకు మథర్ థెరిస్సా జాతీయ సేవా పురస్కారాన్ని ప్రకటించారు. ఈ నెల 22న రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో గల రవీంద్ర భారతిలో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రముఖుల చేతుల మీదుగా అందజేయనున్నారు.