న్యూఢిల్లీ: ఒక మహిళ బావి అంచున ప్రమాదకరంగా కూర్చొన్నది. బావిలోకి వేలాడుతున్న పిల్లవాడ్ని ఒక చేతితో పట్టుకుని రిస్కీగా రీల్ చేసింది. (Mother Creates Reel With Child) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పిల్లవాడి రిస్క్ గురించి పట్టించుకోని ఆ మహిళ రీల్ పిచ్చిపై నెటిజన్లు మండిపడ్డారు. ఒక మహిళ తన కుమారుడైన పసి బాలుడి ప్రాణాలను పణంగా పెట్టింది. బావి అంచున కూర్చొన్న ఆమె ఆ పిల్లవాడి చేతిని పట్టుకుని రీల్ చేసింది. పాటకు అనుగుణంగా డ్యాన్స్ కదలికల కోసం పలుమార్లు చేతులు మార్చింది. ఈ నేపథ్యంలో బావిలోకి ప్రమాదకరంగా వేలాడిన ఆ బాలుడు ఆమెను గట్టిగా పట్టుకున్నాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ రిస్కీ రీల్‌పై నెటిజన్లు మండిపడ్డారు. పిల్లవాడి భద్రత గురించి పట్టించుకోని ఆమె, షార్ట్ రీల్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రీల్ వ్యామోహంలో బాలుడి ప్రాణాలను పణంగా పెట్టిందని ఆరోపించారు. ‘ఈ వ్యక్తులకు ఏమైంది’ అని ఒకరు ప్రశ్నించారు. ‘నేటి ప్రపంచంలో తల్లిగా ఉండటం కంటే ఇంటర్నెట్ కీర్తి చాలా ముఖ్యంగా మారింది. ఈ సాక్ష్యం చాలా బాధాకరం’ అని మరొకరు వ్యాఖ్యానించారు. చిన్న పిల్లవాడి సేఫ్టీ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆ మహిళపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేశారు.
Family court in custody case: Only mother can love child more. Even more than father.
Le mother:#ParentalAlienation pic.twitter.com/mc1kl5ziFj— Raw and Real Man (@RawAndRealMan) September 18, 2024