ఇద్దరు పిల్లలకు ఉరివేసి తల్లి ఆత్మహత్య
ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి, తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా ధారూరు మండలం చింతకుంటలో శనివారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంటకు చెందిన వాసవిరెడ్డి (32) భూపతిరెడ్డి దంపతులు.
- వికారాబాద్ జిల్లా చింతకుంటలో దారుణం
ధారూరు, అక్టోబర్ 31: ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు ఉరి వేసి, తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషాదకర ఘటన వికారాబాద్ జిల్లా ధారూరు మండలం చింతకుంటలో శనివారం చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంటకు చెందిన వాసవిరెడ్డి (32) భూపతిరెడ్డి దంపతులు. వీరికి సహస్ర్రెడ్డి(7), వేదాన్ష్ రెడ్డి(4) ఇద్దరు కుమారులు.
భూపతిరెడ్డి లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వీరు కొంతకాలంగా వికారాబాద్‌లో ఉంటున్నారు. శనివారం వాసవిరెడ్డి తన ఇద్దరు కుమారులతో కలిసి చింతకుంటకు వచ్చింది. ఇంట్లో ఇద్దరు పిల్లలకు ఫ్యాన్‌కు ఉరివేసి, ఆపై ఆమె కూడా ఉరి వేసుకున్నట్టు స్థానికులు తెలిపారు. వాసవి కొంతకాలంగా మానసిక సమస్యతో బాధపడుతున్నట్టు చెప్తున్నారు. ఈ ఘటనపై ఇంకా ఫిర్యాదు అందలేదని ఎస్సై సురేశ్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

