Monty Panesar : ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్(Monty Panesar) రెండో పెళ్లి చేసుకున్నాడు. 43 ఏళ్లున్న పనేసర్ ఈమధ్యే సుబ్రినా జోహల్ (Subrina Johal)ను మనువాడాడు. తమ వివాహ ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నాడు. మై మిస్సింగ్ పీస్ అని క్యాప్షన్ పెట్టాడీ వెటరన్. ఆమె పోస్ట్ అలా జరిగిపోయింది. కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాం అని కామెంట్ రాసింది. దాంతో, కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో ఇంగ్లండ్ విజయాల్లో కీలకమైన పనేసర్ మొదటి భార్య పేరు గురుశరన్ రత్తాన్(Gursharan Rattan). 31 ఏళ్ల వయసులో ఆమె నుంచి ఈ దిగ్గజ స్పిన్నర్ విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్న అతడు.. 12 ఏళ్ల తర్వాత రెండో పెళ్లితో వార్తల్లో నిలిచాడు. అతడు మనువాడిన సుబ్రినా ఒర్చర్డ్ మీడ్ అకాడమీకి ప్రిన్సిపల్‌గా సేవలందిస్తోంది.
భారత సంతతికి చెందిన మాంటీ పనేసర్ ఇంగ్లండ్ తరపున 2006లో అరంగేట్రం చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ తన ముద్ర వేసిన మాంటీ.. టెస్టుల్లో 167, వన్డేల్లో 24, టీ20ల్లో రెండు వికెట్లు తీశాడు. ఇంగ్లండ్ జట్టు 2012-13లో భారత గడ్డపై సిరీస్ గెలుపొందడంలో పనేసర్ కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచుల్లో 17 వికెట్లు.. ఇందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనతో టీమిండియాకు షాకిచ్చాడు. వీడ్కోలు అనంతరం కామెంటేటర్‌గా కొనసాగుతున్న పనేసర్.. ఇటీవల యాషెస్ సిరీస్(Ashes Series)లో ఇంగ్లండ్ దారుణ ఓటమిపై స్పందించాడు. ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి మాత్రమే ఇంగ్లండ్‌ను గెలుపు తోవ తొక్కించగలడని పేర్కొన్నాడు.
“Panesar has done it AGAIN!” 🎙
Tendulkar trapped LBW ☝
Happy Birthday, Monty! 🎉 pic.twitter.com/nEmY3pk0Wy
— England Cricket (@englandcricket) April 25, 2025