Monty Desai : టీ20 ప్రపంచకప్ 2028 బెర్తుపై ఆశలు పెట్టుకున్న కెనడా(Canada)కు భారీ షాక్. అవినీతి, ఆరోపణల మధ్య ఆ జట్టు కోచ్ పదవికి మాంటీ దేశాయ్ (Monty Desai) రాజీనామా చేశాడు. మూడు నెలలుగా మధ్యంతర కోచ్గా కొనసాగుతున్న ఆయన గురువారం తన బాధ్యతల నుంచి వైదొలిగాడు. ఓ వైపు అవినీతి, మరోవైపు ఐసీసీ నిఘా నడుమ మాంటీ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుతెలుస్తోంది.
నిరుడు భారత్, శ్రీలంక ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్లో అవినీతి, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కెనడా క్రికెట్లో కలకలం రేపాయి. అనంతరం మే నెలలో మధ్యంతర కోచ్గా వచ్చిన మాంటీ దేశాయ్.. మూడు నెలలకే రాజీనామా చేశాడు. చిన్న అధ్యాయమే అయినప్పటికీ అర్ధవంతమైన ప్రయాణం అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా అతడు ఈ విషయాన్ని వెల్లడించాడు.
A short chapter, but a meaningful one.
Grateful to Cricket Canada for the opportunity to serve as Interim Head Coach over the past three months.
Every environment leaves you with learnings. This experience further strengthened my belief that sustainable performance is built… pic.twitter.com/cxi4OuOwCe
— montydesaiofficial (@montydesai) August 19, 2026
‘ఒక చిన్న అధ్యాయమే కానీ అర్ధవంతమైనది. గత మూడు నెలలు మధ్యంతర కోచ్గా నాకు అవకాశమిచ్చినందుకు కెనడా క్రికెట్కు కృతజ్ఞతలు. ప్రతి వాతావరణం మనకు కొన్ని నేర్పిస్తుంది. సుస్థిరమైన ప్రదర్శన అనేది సమయం, నమ్మకం, సన్నద్ధత, బలమైన అనుబంధాలు, సమిష్టి యాజమాన్యంతోనే సాధ్యపడతాయనే నా నమ్మకం ఈ అనుభవంతో మరింత బలపడింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది.. అందరికీ ధన్యవాదాలు. కెనడా క్రికెట్ విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నా’ అని మోటి దేశాయ్ పేర్కొన్నాడు. అతడి స్థానంలో మరొకరిని కోచ్గా నియమించేందుకు దరఖాస్తులు ఆహ్వానించింది కెనడా క్రికెట్. అగస్టు 28 వరకూ ఆసక్తిగల వారు అప్లై చేసుకోవచ్చని వెల్లడించింది కేసీ.