Students Protest : జీవో 97 తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో పడేసిన సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. రామోజీ ఫిలింసిటీ సమీపంలోని రోడ్డుపైకి వచ్చి విద్యార్థులు అందోళనకు దిగారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కూడా అయిన సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో ఓ విద్యార్థి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డీ నీకు కనీసం తెలుగులో ఉత్తరం రాయడం అయినా వచ్చా..? అని ప్రశ్నించాడు. మాకు దరఖాస్తు ఫారం కూడా రాయరాదని మీరంటున్నారు, కనీసం మీరు ఏదో ఒకటి తెలుగులో రాయగలరా..? అని నిలదీశాడు. నాలుగు ఐదో తరగతి చదువుతున్న మా తమ్ముళ్లు, చెల్లెళ్లు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారని, మీకు ఆ ఇంగ్లీష్ కూడా రాదని ఎద్దేవా చేశాడు.
నీకు కనీసం తెలుగులో లెటర్ రాయడం వచ్చా రేవంత్ రెడ్డి?
మాకు అప్లికేషన్ రాయడం రాదు అంటున్నావు.నీకు కనీసం తెలుగులోనైనా రాయడం వచ్చా ?
రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళన
జీవో 97 రద్దు చేయాలని డిమాండ్ pic.twitter.com/gQVLChQ7wg
— Mirror TV (@MirrorTvTelugu) August 20, 2026