Polytechinc Student | మాకు రాసేందుకు రాదు.. చదవేందుకు రాదు అంటడు.. ఆయనకొస్తదా ఫస్ట్.. అని రేవంత్ రెడ్డిని అడుగుతున్నానని ఓ పాలిటెక్నిక్ విద్యార్థి ప్రశ్నించాడు. శక్తి స్కీమ్‌లో పాలిటెక్నిక్ కాలేజీని విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు చేపట్టారు.
ఈ సందర్భంగా సదరు పాలిటెక్నిక్ విద్యార్థి మాట్లాడుతూ.. నాది నాగర్‌కర్నూల్‌లోని కల్వకుర్తి. మా ఊరి పక్కనే రేవంత్ రెడ్డి ఊరు. ఆయనకు వస్తదా ఏమన్నా.. చదవనీకే రాదు.. ఇంగ్లీష్ మాట్లాడనీకే రాదు.. మా తమ్ముళ్లు మాట్లాడుతరు.. 4, 5 వ తరగతివాళ్లు మాట్లాడుతరు.. చదవనీకి రాదు.. ఏం రాదు.. మళ్లా మా గురించి పెద్ద ఏమో చెప్తున్నడు. మాకు కాలేజీ దగ్గర ఆందోళన చేస్తే విలువ దొరుకుతలేదని మేము రోడ్డు మీదికి వచ్చినం.. డిప్లొమా చేస్తే మాకు ప్రైవేట్ జాబ్సే వస్తయి.. ప్రభుత్వ ఉద్యోగాలేం రావు.. స్కాలర్ షిప్ లేదు.. ఫీ రీయింబర్స్ మెంట్ లేదు.. ఏం లేదు.. అని రేవంత్ సర్కార్‌పై ఫైర్ అయ్యాడు.
ఈ రేవంత్ రెడ్డి ఎవరికీ చెప్పకుండా ఏం సమాచారం ఇవ్వకుండా GOలు పాస్ చేస్తే మేమేం కావాలి.. ఇదేదో మా ఫ్యూచర్ నాశనం చేసేందుకు ప్రయోగం లెక్క చేస్తున్నడని మరో విద్యార్థి ఫైర్ అయ్యాడు.. మాకు మంచి ఫ్యూచర్ ఉండాలని మేము డిప్లొమా చేస్తున్నం.. బీటెక్‌కు ఈసెట్ రాసి పోవాలనుకుంటున్నం. కానీ మమ్మల్ని ఈసెట్ రాయకుండా స్కిల్ యూనివర్సిటీ చేసి లేబర్ కూలీల్లాగా బతుకుమంటే మేమేం కావాలి. ఆయన మంచిగనే ఉంటడు. మేమే కదా.. ఒకరు కదా ఇద్దరు కాదు కాలేజీల నుంచి చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
మేము రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తామన్నా పోలీసులు వచ్చి మమ్మల్ని కొట్టడం మొదలుపెట్టారు. అక్కడ ఇప్పటికే మా ఇద్దరు అన్నలను కొట్టారు. మైనర్లను కొట్టారు.. మైనర్లను ఎట్లా కొడుతారని ప్రశ్నించారు. మమ్మల్ని ఆందోళన చేయనిస్తలేదు.. అలా చేయనీయకపోతే మేం భవిష్యత్‌లో ఎలా బాగుపడ్తం చెప్పండని రేవంత్ సర్కార్‌ను అడిగాడు.
రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ మాట్లాడటం రాదు, ఆయన వచ్చి మాకు చెప్తున్నాడు
మాకు రాయడానికే, చదవడానికే రాదని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. ఆయనకు వస్తదా ఫస్ట్
4th, 5th క్లాస్ వాళ్లు ఇంగ్లీష్‌లో మాట్లాడుతారు.. రేవంత్ రెడ్డికే రాదు
కాలేజీ దగ్గర ధర్నాలు చేస్తుంటే మమ్మల్ని పట్టించుకోవడం లేదని… https://t.co/3or8gOfywc pic.twitter.com/T77BWosvp4
— Telugu Scribe (@TeluguScribe) August 20, 2026
రేవంత్ రెడ్డి ఇలా ఎవరిని అడగకుండా GOలు పాస్ చేస్తే మా ఫ్యూచర్ ఏం కావాలి
మాకు మంచి ఫ్యూచర్ ఉండాలని డిప్లొమా చేశాము.. అలా కాదు, మీరు లేబర్‌లాగా ఉండాలి అంటే ఎలా
ఇదేంటని రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నిస్తే పోలీసులు మమ్మల్ని కొడుతున్నారు
– పాలిటెక్నిక్ విద్యార్థులు https://t.co/NFhUQ1zxJd pic.twitter.com/p2JPjHXLyb
— Telugu Scribe (@TeluguScribe) August 20, 2026