Mohanlal | మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందింది. భారీ పాన్ ఇండియన్ మూవీగా రూపొందిన కన్నప్ప చిత్రాన్ని జూన్ 27న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. భారీ బడ్జెట్‌తో, స్టార్ కాస్టింగ్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ విష్ణు కెరీర్లో ఒక పెద్ద మైలురాయిగా మారనుంది. ఈ సినిమాలో మంచు మోహన్ బాబు కీలక పాత్రలో నటిస్తుండడంతో పాటు నిర్మాతగానూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విశేషం ఏమిటంటే .. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి పలు ఇండస్ట్రీ స్టార్ నటులు ఈ చిత్రంలో భాగమవుతున్నారు.అందుకే ఈ సినిమాపై ఓ రేంజ్లో హైప్ వచ్చింది.
ఇక సినిమా విడుదల సమీపిస్తున్న వేళ, మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో, తాజాగా కన్నప్ప ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కేరళలోని కొచ్చిలో ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మంచు విష్ణు, మోహన్ బాబు, డైరెక్టర్ ఆంటోనీ తదితర యూనిట్ సభ్యులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ లాల్ మాట్లాడుతూ .. ‘‘ఇప్పటివరకు నేను కలిసిన స్వీటెస్ట్ పర్సన్స్ లో మోహన్ బాబు సర్ ఒకరు. ఆయన సుమారు 600 సినిమాల్లో నటించడం నిజంగా అద్భుతం అంటూ మోహన్ బాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతలో ఒక సరదా సంభాషణను మోహన్ బాబు.. మోహన్ లాల్‌తో షేర్ చేస్తూ ..‘‘మీరు నటించే సినిమాలో నేను విలన్‌గా నటించాలనుంది’’ అన్నారు.
దీనికి మోహన్ లాల్ స్పందిస్తూ..‘‘మీరే హీరో, నేనే విలన్‌గా చేస్తా… ఆ ఛాన్స్ నాకు ఇవ్వండి’’ అంటూ నవ్వుతూ చెప్పారు.ఆంటోనీ ఇది సాధ్యమవుతుందా అని మోహన్ లాల్ కింద ఉన్న డైరెక్టర్ ను అడగ్గానే ఆయన ఓకే అన్నారు. వెంటనే మోహన్ లాల్ నవ్వుతూ.. ‘‘నేను విలన్ అయితే ఫస్ట్ సీన్లోనే మిమ్మల్ని కాల్చి చంపేస్తా అని అన్నారు. అయితే మోహన్ లాల్ ఈ మాటలు మలయాళంలో చెప్పడంతో మోహన్ బాబుకి అర్థం కాలేదు. వెంటనే విష్ణు వాటిని తెలుగులోకి అనువదించగా, మోహన్ బాబు నవ్వుతూ ‘‘వద్దు వద్దు… అలా చేయొద్దు’’ అంటూ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సరదా సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ కాంబినేషన్‌ని తెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.