న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఎన్ఎల్సీ ఇండియా డైరెక్టర్(ప్లానింగ్, ప్రాజెక్ట్)గా కలసాని మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా) కోల్కతా నుంచి మైనింగ్ ఇంజినీరింగ్ చేసిన రెడ్డి.. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్, ఎంబీఏ డిగ్రీ చేశారు. గతంలో నైవేలీ ఉత్తరప్రదేశ్ పవర్ లిమిటెడ్ సీఈవోగా విధులు నిర్వహించారు. మహబూబాబాద్ రైతు కుటుంబానికి చెందిన రెడ్డి.. ఎన్ఎల్సీ ఇండియాలో 2013లో చేరారు. గతంలో సింగరేణి, వెస్ట్రన్ కోల్ఫిల్డ్ లిమిటెడ్లో కూడా పని చేశారు.