బీదర్ మదరసాలో దసరా పూజలు..
Bidar Madrasa:కర్నాటకలోని బీదర్‌లో ఉన్న వారసత్వ కట్టడం మదరసాలోకి ఓ గుంపు ప్రవేశించి హంగామా చేసింది. దసరా ఊరేగింపులో పాల్గొన్న ఓ గుంపు మదరసా గేటును విరగొట్టి దాంట్లోకి ప్రవేశించారు. బిల్డింగ్ వద్ద నినాదాలు చేస్తూ..
బీదర్: కర్నాటకలోని బీదర్‌లో ఉన్న వారసత్వ కట్టడం మదరసాలోకి ఓ గుంపు ప్రవేశించి హంగామా చేసింది. దసరా ఊరేగింపులో పాల్గొన్న ఓ గుంపు మదరసా గేటును విరగొట్టి దాంట్లోకి ప్రవేశించింది. బిల్డింగ్ వద్ద నినాదాలు చేస్తూ.. అక్కడే దసరా పూజను నిర్వహించారు. ఈ ఘటనలో పోలీసులు 9 మందిపై కేసును నమోదు చేశారు. నలుగుర్ని అరెస్టు చేశారు.
బీదర్‌లో ఉన్న మదరసాను 1460లో నిర్మించారు. దీన్ని మహమద్ గవాన్ మదరసా అని పిలుస్తున్నారు. పురావాస్తు శాఖ దీన్ని వారసత్వ కట్టడంగా గుర్తించింది. జాతీయ ప్రాముఖ్యత కలిగిన నిర్మాణంగా కూడా దీన్ని గుర్తిస్తున్నారు. దసరా రోజున ఊరేగింపుగా వచ్చిన జనం.. గేట్లను విరగొట్టి మదరసాలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు.
జైశ్రీరామ్, హిందూ ధరమ్ జై అంటూ నినాదాలు చేశారు. మదరసాలో ఉన్న మెట్లపై నిలుచుకున్న జనం.. అక్కడ ఓ మూలన పూజ కూడా నిర్వహించినట్లు తెలుస్తోంది. మెట్ల మీద ఉన్న జనం.. బిల్డింగ్ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించినట్లు వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. ఈ ఘటనను బీదర్‌లోని ముస్లిం సంఘాలు ఖండించాయి. నిరసన ప్రదర్శలు కూడా చేపట్టాయి.
మజ్లిస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా దీనిపై స్పందించారు. రాష్ట్రంలోని బీజేపీ పార్టీని ఆయన తప్పుపట్టారు. ముస్లింలను కించపరిచేందుకు ఆ పార్టీ ఇలాంటి ఘటనలు చేయిస్తున్నట్లు ఆయన తన ట్విట్టర్లో ఆరోపించారు.
Visuals from historic Mahmud Gawan masjid & madrasa, Bidar, #Karnataka (5th October). Extremists broke the gate lock & attempted to desecrate. @bidar_police @BSBommai how can you allow this to happen? BJP is promoting such activity only to demean Muslims pic.twitter.com/WDw1Gd1b93
— Asaduddin Owaisi (@asadowaisi) October 6, 2022
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

