పాలకుర్తి : ఇల్లు అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రధానమైన అవసరం. నిరుపేదలకు ఇండ్లు కట్టించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(MLA Yashaswini Reddy )అన్నారు. శుక్రవారం పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పట్టాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇది కేవలం గృహం కాదు, ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చే ఆశ్రయం అన్నారు. అలాగే, లబ్ధిదారులు పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటి నిర్మాణంలో పారదర్శకత, నాణ్యత కచ్చితంగా పాటించాలన్నారు. ప్రభుత్వ నిధులు అర్హులైన వారికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షైక్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.