హైదరాబాద్ : కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్(MLA Sanjay) మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఫిట్స్(Fits) వచ్చిన వ్యక్తికి ప్రథమ చికిత్స(First aid) చేసి ప్రాణాలు కాపాడారు. వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల-మెట్పల్లి రహదారిపై ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న డిచ్పల్లికి చెందిన వ్యక్తికి అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి కిందపడిపోయాడు. అదే సమయంలో అటువైపు వెళ్తున్న ఎమ్మెల్యే సంజయ్ గమనించి ఫిట్స్ వచ్చిన వ్యక్తికి ప్రథమ చికిత్స అందించారు. ఏమీ కాదని తగ్గిపోతుందని భరోసా కల్పించారు. సకాలంలో స్పందించి వైద్యమందించిన ఎమ్మెల్యేను పలువురు అభినందించారు.
ఫిట్స్ వచ్చిన వ్యక్తికి ప్రథమ చికిత్స చేసిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
కోరుట్ల-మెట్పల్లి రహదారిపై ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న డిచ్పల్లికి చెందిన వ్యక్తికి అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చింది.
అదే సమయంలో అటువైపు వెళ్తున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ గమనించి… pic.twitter.com/c77VXx6j7S
— Telugu Scribe (@TeluguScribe) August 9, 2024