బండ్లగూడ,డిసెంబర్ 21: శివారు ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. మంగళవారం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మేయర్ మహేందర్‌గౌడ్, కార్పొరేటర్లతో పలు వార్డుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాల వారికి సముచిత స్థానం కల్పిస్తూ ప్రజల మన్ననలను పొందుతున్నారని అన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు నగర శివారుల్లో ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. రాజేంద్రనగర్ నియెజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
మిషన్ భగీరథతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీటి వసతిని కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మేయర్ మహేందర్‌గౌడ్ మాట్లాడుతూ బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తి కాగా మరికొన్ని ప్రాంతాల్లో పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్‌రెడ్డి, కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, కార్పొరేటర్లు మాలతీనాగరాజు, పద్మావతి పాపయ్య యాదవ్, అనిత వెంకటేశ్, చంద్రశేఖర్, రవీందర్‌రెడ్డి, పుష్పశ్రీనివాస్రెడ్డి, లతప్రేమ్‌గౌడ్, శ్రీలత సురేశ్‌గౌడ్, ప్రశాంత్‌నాయక్, బీజేఎంసీ టీఆర్ఎస్ అధ్యక్షుడు సురేశ్‌గౌడ్, గోపాల్ ముదిరాజ్, రాజిరెడ్డి, సుమన్‌గౌడ్, రాజక్ పాల్గొన్నారు.