అత్తాపూర్, డిసెంబర్ 9: కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ అన్నారు. గురువారం తెలంగాణ భవన నిర్మాణ కార్మికసంఘం ఆధ్వర్యంలో 500 మంది కార్మికులకు గుర్తింపు కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కార్మికులకు కార్డులను అందజేసి మాట్లాడారు. కార్మికులకు ఏ కష్టం వచ్చిన తాను ఉన్నానని, ఎలాంటి సహాయం కావాలన్న చేస్తామని తెలి పారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఎంతో మంది కార్మికులకు ప్రభుత్వం నుంచి సహాయం అందించామని, మహిళా కార్మికులకు కంపెనీలలో పనివేళలను తగ్గించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. పనికి తగిన వేతనం ఇప్పించామని గుర్తుచేశారు.
కార్మికులు పనిచేస్తున్న సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని రక్షణ చర్యలు లేకుండా పనులు చేయడం అపాయమన్నారు. ము ఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండి పనులు చేయాలన్నారు. రాష్టం ఏర్పడిన తరువాత కార్మిక చట్టాలను తప్పని సరిగా పాటించే వి ధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కార్మికులకు గుర్తింపు కార్డులను అందిస్తూ ఏదైనా ఆపద వస్తే కార్మిక కటుంబాలకు రక్షణ కోసం నగదు అందే విధంగా ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. కార్యక్రమంలో అత్తాపూర్ డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీరాంరెడ్డి, జిల్లా నాయకుడు మిద్దెల సురేందర్ రెడ్డి, చెరకు అమరేదంర్, భవన నిర్మాణ కార్మికసంఘం గ్రేటర్ అధ్యక్షుడు చెన్నయ్య, ఆటో యూనియన్ అధ్యక్షుడు నరసింహ తదితరులు పాల్గొన్నారు.