బండ్లగూడ,డిసెంబర్ 5: రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని శివరాంపల్లికి చెందిన శైమాల్ కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధి తో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ఆయన రాజేంద్రనగర్ నియోజక వర్గం జాగృతి కన్వీనర్ రగడం పల్లి శ్రవణ్‌కుమార్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రెండు లక్షల ఎల్వోసీని బాధితుడికి ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ ఆదివారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ నాయకులు పలుగు చెరువు మహేశ్, సయ్యద్ ముజమిల్ అహ్మద్, సాయి మాలిక్ తదితరులు పాల్గొన్నారు.