భూదాన్ పోచంపల్లి, మే 27 : భూదాన్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణగిరికి చెందిన మహిళా రైతు రమాదేవి ఆదర్శ రైతుగా నిలిచారు. ఆమె భర్త బాల్రెడ్డి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇంటి బాధ్యతలతో పాటు వ్యవసాయ పనులను రమాదేవి చూసుకుంటుంది. మగవారికి ఏమాత్రం తీసిపోకుండా వ్యవసాయ పనులను చేస్తూ ఎకరానికి (ఆరున్నర పుట్లు) 115 బస్తాల వరి ధాన్యం పండించి అందరి చేత మన్ననలు పొందుతుంది. స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రమాదేవిని అభినందించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తడక వెంకటేశ్, కళ్లెం రాఘవరెడ్డి, సామ మధుసూదన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, అనిరెడ్డి జగన్ రెడ్డి పాల్గొన్నారు.