
కుత్బుల్లాపూర్,డిసెంబర్17: అన్ని వర్గాల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. నియోజకవర్గంలోని 198 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ కింద మంజూరైన రూ.1.98 కోట్ల చెక్కులను చింతల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కార్యక్రమంలో నాయకులు సంపత్ మాధవరెడ్డి, గుమ్మడి మధుసూదన్రాజ్, కె.ముకుందం, మధుమోహన్, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ప్రైవేట్‌కు దీటుగా రాణించాలి
ప్రభుత్వ కళాశాలల్లో మెరుగైన ఫలితాలతో ప్రైవేట్‌కు దీటుగా రాణించాలని ఎమ్మెల్యే తెలిపారు. కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అత్యుత్తమ ఫలితాలను సాధించిన నూర్ ఫాతిమా, మెహరాజ్ ఫాతిమా, అయోషాలతో పాటు తదితర విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. విద్యారంగంలో ఎలాంటి లోటులేకుండా అన్నీ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఉత్తమ ఫలితాలతో పేరు ప్రఖ్యాతులు సాధించాలని ఆశించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ తిరుపతి, అధ్యాపక బృందం, కో-ఆర్డినేటర్ నారాయణరావు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
దుండిగల్, డిసెంబర్17: చర్చిగాగిళ్లాపూర్ పరిధిలోని రాజీవ్‌గాంధీనగర్‌లో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ అన్నారు. నియోజకవర్గంలోని సర్వే నంబర్ 214 బస్తీవాసులు టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మద్దికుంట సంజీవరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శుక్రవారం కలిసి వినతి పత్రం అందజేశారు. బస్తీలో తాగునీటి పైపులైన్ ఏర్పాటు చేయాలని, రేషన్ దుకాణం, అంగన్వాడీ కేంద్రం, మహిళా భవనం నిర్మించాలని కోరారు.
అంతర్గతరోడ్లు, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలన్నారు. గౌసే పాక్ దస్తగిరి చిల్లా దర్గా ప్రహరీ నిర్మించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. రాజీవ్‌గాంధీనగర్‌లోని సమస్యలను గుర్తించి, మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో బస్తీవాసులు కరీమ, ముర ళి, హసీనా, గోవన్, లక్ష్మీభారతి, జహేరా పాల్గొన్నారు.