
గాజులరామారం, డిసెంబర్ 16 : ఉద్యమ కళాకారుడు జంగ్ ప్రహ్లాద్ కుటుంబాన్ని ప్రభుత్వం తరుపున ఆదుకుంటామని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం జంగ్ ప్రహ్లాద్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి.. తమ కుటుంబ పరిస్థితిని వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో పల్లె పల్లెన ఉద్యమాన్ని ఉరకలెత్తించిన జంగ్ ప్రహ్లాద్ మృతి తెలంగాణకు తీరని లోటన్నారు. ప్రహ్లాద్ కుటుంబాన్ని ప్రభుత్వం తరుపున అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నెల 19న సాయంత్రం 6 గంటలకు జగద్గిరిగుట్టలో నిర్వహించే సంతాప సభకు హాజరవుతానని తెలిపారు. కార్యక్రమంలో ఓయూ జాక్ నేత దరువు అంజన్న, టీఆర్ఎస్ నాయకులు బాబుగౌడ్, శ్రావణి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
జీడిమెట్ల , డిసెంబర్ 16 : రంగారెడ్డినగర్ డివిజన్, గాంధీన గర్లో గురువారం ఏర్పాటు చేసిన వారంతపు కూరగాయల మార్కెట్లో వ్యాపారులకు కొవిడ్ టీకాను వైద్య సిబ్బంది వేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు జగదీశ్వరి, సిబ్బంది కవిత, పద్మ, మణి, స్థానిక నాయకులు జల్దా లక్ష్మీనాథ్, వాజిద్ తదితరులు పాల్గొన్నారు.