పైసలివ్వనిదే ఫైలు కదుల్తలేదు
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పంచాయతీ సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు పైసలు లేనిదే ఫైలు కదలడం లేదని విమర్శించారు.
- పంచాయతీ సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ఇదే దుస్థితి
- కొత్త బిచ్చగాళ్లు షో చేస్తున్నరు
- ఓపిక పడుతున్నా.. అభివృద్ధి పనులకు కూడా నిధులిస్తలేరు
- ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
గట్టుప్పల్, నవంబర్ 1: కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పంచాయతీ సెక్రటరీ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు పైసలు లేనిదే ఫైలు కదలడం లేదని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం అధికార పార్టీలో ఉండి కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే మాదిరిగా కొట్లాడాల్సి వస్తున్నదని, ఇది సిగ్గుచేటు అని మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందకపోవడంతో నియోజకవర్గ అభివృద్ధిలో కొంత వెనుకబడిందని చెప్పారు.
ఆదివారం గట్టుప్పల్ మండల కేంద్రంలోని కురుమ సంఘానికి చెందిన శ్రీబీరప్ప గొర్రెల పెంపకందారుల సహకార సంఘం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కురుమ సంఘాలకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. సమాజంలో మంచితనాన్ని ఓర్చుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టే నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదని, నిన్న మొన్న కొత్త బిచ్చగాళ్లు వచ్చి షో చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బెల్టుషాపులను నిర్మూలిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టిందని, కానీ నిర్మూలించలేకపోయిందని దుయ్యబట్టారు.
మునుగోడు నియోజకవర్గంలో మాత్రమే బెల్ట్‌షాపులను నిర్మూలిస్తున్నామని చెప్పారు. తనను ఎవరూ ప్రలోభ పెట్టలేరని అన్నారు. ‘రాజకీయాలు మారాలి. నాయకులు మారాలి. వ్యవస్థ మారాలి. అప్పుడే అభివృద్ధి జరుగుతుంద’ని వ్యాఖ్యానించారు. తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారని, ప్రభుత్వం వచ్చి మూడేైండ్లెనా పదవి ఇవ్వలేదని చెప్పారు. ఓపిక పట్టుకొని ఉన్నానని, కనీసం అభివృద్ధికి నిధులు కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ‘రైతుబంధు గురించి ఊర్లల్లో అడుగుతున్నారు. హామీ ఇచ్చిన ఆయన బాగానే ఉన్నడు. రైతులకు ఏం చెప్పాలో అర్థం కావడం లేద’ని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

