బార్పెట: గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ.. అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలోని తగ్గేదేలే డైలాగ్ కొట్టారు. అస్సాం పోలీసులు నమోదు చేసిన తప్పుడు కేసులో ఆయనకు శుక్రవారం బెయిల్ మంజూరీ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జుకేగే నహీ అంటూ పుష్ప హిందీ ఫిల్మ్‌లోని డైలాగ్ కొట్టారు. తన ట్విట్టర్ అకౌంట్లోనూ అల్లు అర్జున్ డైలాగ్ జిఫ్‌ను పోస్టు చేశారు. మహిళా పోలీసు అధికారిపై దాడి చేశారన్న ఆరోపణల కేసులో మేవానీని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. అయితే శుక్రవారం ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఫేక్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసుల వైఖరిని కోర్టు తప్పుబట్టింది.
— Jignesh Mevani (@jigneshmevani80) April 29, 2022