Jagadish Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కొంచెం పొంగు ఎక్కువైంది అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. 22ఏలో మా భూములు పెట్టి మమ్మల్నే అడుగుతారా అని రెవెన్యూ మంత్రి పొంగులేటి దగ్గరికి, రేవంత్ దగ్గరికి పోయి మా భూములన్న వదలండని మంత్రులు బ్రతిమిలాడుకుంటున్నారు. ఒకరిద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా అదే ఉందన్నారు.
పోలవరం మొదలు పెట్టింది ఎప్పుడు? పనులు ప్రారంభించింది ఎవరు? అని ప్రశ్నించారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా దక్కదని పోలవరం కట్టొద్దని ఆనాడు కేసు వేసిందే మేము. మేము శంకుస్థాపనలు చేసి 90 శాతం కడితే వీళ్లు ప్రారంభోత్సవాలు చేస్తున్నారని మండిపడ్డారు.మేము తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడం లేదు.. రేవంత్ రెడ్డి కుటుంబ అభివృద్ధిని అడ్డుకుంటున్నామని స్పష్టం చేశారు.
కొందరు మంత్రుల భూములని తెలియక వాళ్ల బినామీలని పిలిచి నిషేధిత జాబితాలో నుండి తీసేస్తామని 30 శాతం కమిషన్ ఇవాలని పైరవీకారులు అడిగారు. ఇది తెలంగాణలో నేడు కాంగ్రెస్ పాలన అని అన్నారు. అలాగే కొండా సురేఖను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకునే ఆలోచన మాకు లేదు.. మా వైపు నుండి ఆ ప్రయత్నం కూడా లేదని స్పష్టం చేశారు.