మక్తల్, ఆగస్టు 27 : నిద్రిస్తున్న మహిళపై కన్న కొడుకు ముందే లైంగిక దాడి చేసి సదరు మహిళ ప్రైవేట్ పార్ట్స్ ను కోసి వేసిన ఘటన నారాయణపేట జిల్లా మక్తలపట్టణంలో గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. వివరాల లోకి వెళితే..మక్తల్ పట్టణానికి చెందిన ఓ మహిళ గత కొన్ని సంవత్సర నుండి ఒంటరిగా తన 12 ఏండ్ల కొడుకుతో జీవనం కొనసాగిస్తున్నది. జీవనోపాధికోసం సదరు మహిళ పట్టణంలో నీ ప్రధాన కూడలి తోపాటు, బస్టాండ్ లో బిక్షాటన చేస్తూ జీవిస్తున్నది. గత 10సంవత్సరాలకు పైగా రాత్రి పూట మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం వద్ద తలదాచుకుంటున్నది.
ఈ క్రమంలో గురువారం తెల్లవారు జామున ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మక్తల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం వద్ద నిద్రిస్తున్న తల్లి కొడుకుల దగ్గరకు వెళ్లి, తల్లిపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించిన క్రమంలో తల్లి కేకలు వేయడంతో నిద్రస్తున్న మహిళా కుమారుడు లేచాడు. తల్లిపై దాడికి దిగిన ఇద్దరు వ్యక్తులను అడ్డుకొనే ప్రయత్నం చేసినా మద్యం మత్తులో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు పిల్లవాడిపై దాడికి దిగడంతో భయంతో పరుగులు తీశాడు. ఇద్దరు వ్యక్తులు మహిళపై విచక్షణ రహితంగా లైంగిక దాడికి పాల్పడి అనంతరం మహిళ ప్రైవేట్ పాట్స్ ను కోసి వేసి వెళ్లిపోయారు. మహిళ రక్తపు మడుగులో పడిపోయినా దృశ్యాన్ని తెల్లవారు జామున మక్తల్ మినీస్టేడియం గ్రౌండ్లో వాకింగ్ కు వచ్చిన పట్టణ ప్రజలు గమనించి పోలీసులకు సమాచారమందించారు. మక్తల్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని బాధితురాలిని దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.