Raksha Bandhan | ప్రముఖ బాలీవుడ్ నటి కృతిసనన్ (Kriti Sanon) నటించిన ఓ రాఖీ ప్రకటన (Raksha Bandhan Ad) ఇటీవల సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ‘GIVA’ కోసం కృతిసనన్ చేసిన ఈ యాడ్‌పై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి.
రక్షాబంధన్ పండుగ నేపథ్యంలో రూపొందించిన ఈ ప్రకటనలో కృతిసనన్ ఇండో-వెస్టర్న్ స్టైల్ దుస్తులు ధరించి కనిపించారు. అంతేకాకుండా సోదరుడితో పాటు పెంపుడు కుక్కకు కూడా రాఖీ కట్టేయడం వంటి సీన్లు ఉన్నాయి. అయితే ఈ యాడ్‌పై కంగనా రనౌత్ తీవ్రంగా స్పందించారు. మహిళల వద్ద చీరలు, సల్వార్ కమీజ్, లెహంగా వంటి ఎన్నో సాంప్రదాయ దుస్తుల ఆప్షన్లు ఉన్నప్పటికీ.. రక్షాబంధన్ పండుగ రోజు బికినీ, ఇన్నర్ వేర్ లాంటి దుస్తులు ధరించి రాఖీ కట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రకటన ఉద్దేశపూర్వకంగా విచిత్రంగా ఉందని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మండిపడ్డారు. అయితే తన దుస్తులపై వస్తున్న విమర్శలకు కృతిసనన్ గట్టిగా బదులిచ్చారు. సంస్కృతి, సాంప్రదాయాలు బట్టల నెక్ లూప్‌లో ఉండవని, అవి మనిషి హృదయంలో ఉంటాయని స్పష్టం చేశారు. మహిళలు ఏం ధరించాలనేది ఇతరులు చెప్పడం ఎప్పుడో మానుకోవాలని, పండుగ అసలు సారం భావోద్వేగాలలో ఉంటుందని హితవు పలికారు. మరోవైపు ఈ యాడ్ వివాదం కావడంతో ‘GIVA’ జ్యువెలరీ బ్రాండ్ వెనక్కి తగ్గింది. భారతీయ సంస్కృతి, పండుగలను గౌరవిస్తూ తాము ఆ ప్రకటనను అన్ని మాధ్యమాల నుంచి పూర్తిగా తొలగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఇదిలావుంటే కంగనా వ్యాఖ్యలను పలువురు రాజకీయ నాయకులు తప్పుబట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎంపీ సుప్రియా శ్రీనాథ్ తదితరులు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకు, వస్త్రధారణ ఎంపికకు మద్దతుగా నిలిచారు. మహిళలు ఏం ధరించాలనే దానిపై ట్రోలింగ్ ఆపాలని అభిప్రాయపడ్డారు. మరోవైపు, నేషనల్ అవార్డుల సమయంలో కంగనా రనౌత్ ధరించిన మోడ్రన్ గౌన్ల ఫోటోలను నెటిజన్లు తెరపైకి తెచ్చి విమర్శిస్తున్నారు.
Look at Kriti Sanon ‘s dress and Kangana Ranaut ‘s dress while taking award.
— 👑Che_ಕೃಷ್ಣ🇮🇳💛❤️ (@ChekrishnaCk) August 26, 2026