వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిగి మండలం రూప్ సింగ్ తాండాలో దారుణం చోటు చేసుకుంది. సర్పంచ్ రమణి బాయి కుటుంబంపై హత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. అనార్ సింగ్ అనే వ్యక్తి మంగళవారం తెల్లవారుజామున ఇంటి పైకప్పు నుంచి నిప్పంటించడంతో సర్పంచ్‌తో పాటు ఆమె భర్త హన్మంత్ నాయక్, కుమారుడు వెంకటేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి.
మరో కుమారుడు శివకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలే దాడికి కారణమని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.