Vikarabad | వడగండ్ల వానలతో నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి
Vikarabad | అకాల వర్షం, వడగండ్ల వానలతో నష్టపోయిన వికారాబాద్ జిల్లా రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో నష్టపోయిన ఉద్యాన, వ్యవసాయ పంటలను సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పర్యటించారు.
Vikarabad | అకాల వర్షం, వడగండ్ల వానలతో నష్టపోయిన వికారాబాద్ జిల్లా రైతాంగానికి తెలంగాణ ప్రభుత్వం నిలిచింది. మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లో నష్టపోయిన ఉద్యాన, వ్యవసాయ పంటలను సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహా పలువురు ఉన్నతాధికారులు పర్యటించారు. మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లోని దెబ్బతిన్న మామిడి, ఉల్లిగడ్డ, బొప్పాయి వంటి ఉద్యాన పంటలు, మొక్కజొన్న వంటి వ్యవసాయ పంటలను పరిశీలించారు.

అకాల వర్షాలు వికారాబాద్ జిల్లాలో గురువారం మధ్యాహ్నం బీభత్సం సృష్టించాయి. మర్పల్లి, మోమిన్‌పేట మండలాల్లోని 13 గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. ఏకధాటిగా అరగంట నుంచి గంట వరకు వడగండ్లు పడటంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వడగండ్లు రోడ్ల మీద పడి విదేశాల్లోని మంచుప్రాంతాలను తలపించడంతో ప్రజలు వింతగా చూశారు. అయితే వడగండ్ల కారణంగా చాలా చోట్ల పంటలు పాడైపోయాయి. మోమిన్‌పేట మండల పరిదిలోని 400 ఎకరాల్లో కూరగాయ పంటలు, మొక్కజొన్న, గోధుమ, జొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నష్టపోయిన పంటలను మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో కలిసి రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పరిశీలించారు. నష్టపోయిన రైతులను పరామర్శించారు.

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

