రేయ్ నోర్ముయ్.. ఎవడ్రా నువ్వు!
‘రేయ్ నోర్ముయ్.. ఎవడ్రా నువ్వు’ అంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. తన సొంత పార్టీ కార్యకర్తలపైనే ఆగ్రహంతో నోరుపారేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా కేం ద్రంలో చోటుచేసుకున్నది.
-
కాంగ్రెస్ కార్యకర్తలపై నోరు పారేసుకొన్న మంత్రి ఉత్తమ్
-
పేట కాంగ్రెస్‌లో వర్గపోరు
సూర్యాపేట, నవంబర్ 6: ‘రేయ్ నోర్ముయ్.. ఎవడ్రా నువ్వు’ అంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. తన సొంత పార్టీ కార్యకర్తలపైనే ఆగ్రహంతో నోరుపారేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లా కేం ద్రంలో చోటుచేసుకున్నది. శుక్రవారం నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని గెలిపించాలని కోరుతూ జరిగిన ఈ సమావేశ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఫొటో లేకపోవడంపై ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కలుగజేసుకొని ‘రేయ్ నోర్ముయ్.. ఎవడ్రా నువ్వు’ అంటూ ఆగ్రహంతో రగిలిపోయారు. మంత్రి వ్యాఖ్యలతో రగిలిపోయిన వారంతా వేణారెడ్డికి అనుకూలంగా నినాదాలు చేయగా, మరోవర్గం పోటీ నినాదాలు చేయడంతో సమావేశ ప్రాంగణమంతా గందరగోళంగా మారింది. దీంతో తన కార్యకర్తలకు సర్దిచెప్పాలని వేణారెడ్డిని మంత్రి కోరారు. దీంతో వేణారెడ్డి స్వయంగా కలుగజేసుకొని కార్యకర్తలకు సర్దిచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

