సీఎం సెగ్మెంట్‌కే పచ్చ‘ధనం’
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను నిధుల కొరత వెంటాడుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్‌కు మాత్రం గ్రీనరీ పేరిట నిధుల వరద పారుతున్నది. మిగతా ప్రాంతాలకు మొండిచేయి చూపుతూ, అభివృద్ధి ప్రణాళికల పేరిట సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి మాత్రమే రూ.వందల కోట్లు కేటాయించడం తీవ్ర వివాదాస్పదమవుతున్నది
-
అన్ని నియోజకవర్గాలకు నిధుల కొరత..కొడంగల్‌కు మాత్రం ‘గ్రీనరీ’ నిధుల వరద
-
నిబంధనలకు విరుద్ధంగా హెచ్ఎండీఏ నిధులు రూ.వందల కోట్ల మళ్లింపు?
-
రెండేండ్లలో పరిమితికి మించి కేటాయింపు
-
గ్రీనరీ, ల్యాండ్ స్కేపింగ్ పేరిట కోట్లు స్వాహా
-
హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీలో అవినీతి బాగోతం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను నిధుల కొరత వెంటాడుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్‌కు మాత్రం గ్రీనరీ పేరిట నిధుల వరద పారుతున్నది. మిగతా ప్రాంతాలకు మొండిచేయి చూపుతూ, అభివృద్ధి ప్రణాళికల పేరిట సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి మాత్రమే రూ.వందల కోట్లు కేటాయించడం తీవ్ర వివాదాస్పదమవుతున్నది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్, దాని చుట్టుపకల ప్రాంతాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన హెచ్ఎండీఏ నిధులను నిబంధనలకు విరుద్ధంగా కొడంగల్‌కు మళ్లించడమే వివాదానికి కారణమైంది. ఈ భారీ నిధుల కేటాయింపుల్లో సింహభాగం అర్బన్ ఫారెస్ట్రీ, గ్రీనరీ, ల్యాండ్ సేపింగ్ పనుల పేరిటే దారి మళ్లుతుండటం ఇప్పుడు చర్చకు దారితీసింది. హెచ్ఎండీఏలోని అర్బన్ ఫారెస్ట్రీ కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారంలో పచ్చదనం పేరిట ప్రజాధనం పక్కదారి పడుతున్నది.
గ్రీనరీ వెనుక ‘అత్యంత ఆప్తుల’ కాంట్రాక్టులు!
ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన తర్వాత రేవంత్ కొడంగల్ సమగ్ర రూపురేఖలు మారుస్తామని పలు శాఖల సమన్వయంతో ఇప్పటివరకు రూ.12వేల కోట్ల భారీ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేశారు. అందులో ఇప్పటివరకు రూ.4,820 కోట్లు ఖర్చు చేసినట్టు రికార్డులు చెప్తున్నాయి. గడిచిన నాలుగేండ్లలో హెచ్ఎండీఏలోని అర్బన్ ఫారెస్ట్రీ విభాగం గ్రీనరీ, మొకల పెంపకం కోసం దాదాపు రూ.382 కోట్లు ఖర్చు చేయగా, ఇందులో 30శాతానికి పైగా నిధులను ఒక కొడంగల్‌లోనే అది కూడా రెండున్నరేండ్లలో ఉపయోగించడమే అనుమానాలకు తావిస్తున్నది. కొడంగల్‌లో పచ్చదనం పెంపొందించడం కంటే, గ్రీనరీ, ల్యాండ్ సేపింగ్ పేరిట ‘సొంత మనుషులకు’ టెండర్లు కట్టబెట్టడమేనని చర్చ నడుస్తున్నది. కనీస అర్హతలు, అనుభవం లేని కాంట్రాక్టర్లకు టెండర్ల రూపంలో ధారాదత్తం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొత్తగా వచ్చిన అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్‌కు ఈ వ్యవహారంపై సరైన అవగాహన లేకపోవడంతో కొందరు సీనియర్లు చక్రం తిప్పుతున్నారు.
సీఎంవో పేరుతో చక్రం తిప్పుతున్న ‘ముఖ్య నేత’?
హెచ్ఎండీఏలో గ్రీనరీ నిమిత్తం ఏటా దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ ఖర్చవుతుంటుంది. రాష్ట్రంలో లేదా ఉమ్మడి జిల్లాలోని ఏ ఇతర నియోజకవర్గానికి లేని ప్రత్యేక సడలింపులు ఒక కొడంగల్ కే దకడం వెనుక అధికార దుర్వినియోగం ఉన్నదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సీఎంవో పేరును వాడుకుంటూ ఒక కీలక అధికారి, అధికార పార్టీ ‘ముఖ్యనేత’ కలిసి హెచ్ఎండీఏకు చెందిన వందల కోట్ల నిధులను పకదారి పట్టిస్తున్నారని పలువురు కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు.
ఈ నిధుల మళ్లింపులు, కాంట్రాక్టుల ద్వారా పొందే ప్రయోజనాల కోసమే అధికారులు, నాయకులు ఈ అర్బన్ ఫారెస్ట్రీ పోస్టింగ్స్ కోసం పోటీపడుతున్నారని తెలిసింది.ప్రశ్నార్థకంగా మారిన రీజినల్ బ్యాలెన్స్హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని సుందరీకరించేందుకు, కాలుష్య నివారణకు ఉద్దేశించిన హెచ్ఎండీఏ ప్రజాధనం.. సీఎం సొంత నియోజకవర్గానికి మళ్లించడంపై తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నది. కేవలం మొక్కల మీదనే ఇప్పటివరకు వికారాబాద్ జిల్లాలోని ఏ ఇతర నియోజకవర్గానికి దక్కని నిధులు కేవలం కొడంగల్ పేరిట ఖర్చు చేసి, లెక్కకు మించి బిల్లులను తీసుకున్నారనే ఆరోపణలున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

