రైతు మేళానా.. సీఎం బర్త్డే వేడుకలా?
కరువుతో రైతులు అల్లాడుతుంటే సీఎం రేవంత్రెడ్డి కొడంగల్ నియోజకవర్గం హకీంపేటలో రైతు మేళా నిర్వహించడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రశ్నించారు. రైతు మేళా రైతుల కోసమా? సీఎం రేవంత్రెడ్డి పుట్టినరోజు వేడుక కోసమో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు
-
ప్రజలకు సమాధానం చెప్పినంకనేరైతు మేళా నిర్వహించాలి
-
తాగునీరు, సాగునీరు, కరెంటు లేక కష్టాల్లో కర్షకులు ప్రజలు
-
కరువు కష్టాల్లో రైతులుంటే.. సీఎం రేవంత్ బర్త్డే వేడుకలా?
-
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి
కొడంగల్, నవంబర్ 6 : కరువుతో రైతులు అల్లాడుతుంటే సీఎం రేవంత్రెడ్డి కొడంగల్ నియోజకవర్గం హకీంపేటలో రైతు మేళా నిర్వహించడం ఏమిటని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ప్రశ్నించారు. రైతు మేళా రైతుల కోసమా? సీఎం రేవంత్రెడ్డి పుట్టినరోజు వేడుక కోసమో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన వికారాబాద్ జిల్లా కొడంగల్లో మీడియాతో మాట్లాడారు. ఈ నెల 7 నుంచి 9వ తేదీ వరకు హకీంపేటలో రైతు మేళా నిర్వహించడంలో ఆంతర్యమేమిటో సీఎం రేవంత్రెడ్డి రైతులకు వివరించాల్సిన అవసరం ఉన్నదని డిమాండ్ చేశారు. సాగునీరు లేక రైతులు, తాగునీరు అందక ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రైతు మేళా సాకుతో సీఎం రేవంత్రెడ్డి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకొంటున్నారని విమర్శించారు.
సాగునీరు అందక రైతులు వేసుకున్న వరి, కంది, పత్తి, వేరుశనగ వంటి పంటలు పూర్తిగా ఎండిపోయి పశువులకు మేతగా మారినట్టు తెలిపారు. నాలుగు విడతల రైతుభరోసాకు ఎగనామం పెట్టి, రైతు బీమా కిస్తులను చెల్లించకుండా, సన్నాలకు బోనస్ ఇవ్వకుండా, సరైన కరెంట్ అందించకుండా పంటల పరిస్థితిని చూసి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే రైతు మేళా అంటూ సంబురాలు జరుపుకోవడం వి డ్డూరంగా ఉన్నదని అన్నారు. కరువు మం డలాలను ప్రకటించి ఏం మేలు చేశావని సీఎంను నిలదీశారు.
ఎకరాకు రూ.50 వేలు పంట నష్ట పరిహారాన్ని చెల్లించాలని, 4 విడతల రైతుభరోసా చెల్లించిన తరువా తే కొడంగల్లో అడుగుపెట్టాలని స్పష్టం చే శారు. కొడంగల్ ప్రాంతంలో సిమెంట్ కం పెనీ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని, పొల్యూషన్ కంపెనీలను కొడంగల్ ప్రజలకు అంటగట్టి కంపెనీలో వాటా లు దండుకోవడానికి యత్నిస్తున్నట్టు ఆరోపించారు. కొడంగల్ ప్రజ ల మేలు కోరే వ్యక్తి అయితే ఐటీ హబ్, కార్ల కంపెనీ, టెక్స్టైల్, మైక్రోసాఫ్ట్ వంటి వాటిని ఏర్పా టు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఫార్మా కంపెనీని అడ్డుకున్న మాదిరిగానే రైతులను చైతన్యం చేసి సిమెంట్ కంపెనీ అడ్డుకోవడం ఖాయమని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

