మల్లాపూర్, డిసెంబర్ 10: ఏఎస్‌రావునగర్ డివిజన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావనీరెడ్డి భర్త మణిపాల్‌రెడ్డి శుక్రవారం మృతి చెందా డు. అంతుచిక్కని వ్యాధితో యశోద దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆయన మృతిచెందాడు. కమలానగర్‌లోని నివాసంలో మణిపాల్‌రెడ్డి పార్థీవ దేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, నగర మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి, మాజీ మేయర్లు బొంతు రామ్మోహన్, బండ కార్తీకరెడ్డి, నాయకులు బండారి లక్ష్మారెడ్డి, బండ చంద్రారెడ్డి నివాళులర్పించారు. కార్పొరేటర్లు స్వర్ణరాజ్, బొంతు శ్రీదేవి, శిరీషా సోమశేఖర్‌రెడ్డి, పన్నాల దేవేందర్‌రెడ్డి, ప్రభుదాస్, శాంతి సాయిజన్‌శేఖర్, బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, ధన్‌పాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, గొల్లూరి అంజయ్య, నాయకులు జనుంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, పల్లా కిరణ్‌కుమార్‌రెడ్డి అంతిమయాత్రంలో పాల్గొన్నారు.