
హయత్‌నగర్, డిసెంబర్ 23: ‘చారిత్రక, పురాతన కట్టడాలకు రక్షణ కల్పిస్తూ, వాటి పూర్వ వైభవానికి కృషి చేస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం. చారిత్రక కట్టడాల ప్రాధాన్యతను ప్రపంచానికి చాటుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. రాష్ట్రంలో ఉన్న వారసత్వ సంపదను భద్రపరుస్తూ వాటికి గుర్తింపు తీసుకువస్తున్నారు’ అని టూరిజం, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని హయత్‌నగర్ డివిజన్లోని పురాతన కట్టడమైన హయత్ బక్షి ని మంత్రి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త, ఎమ్మెల్సీలు ఎగ్గె మల్లేశం, బోగారపు దయానంద్, ఎంఆర్డీసీ చైర్మ న్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డిలతో గురువారం సందర్శించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అనంతరం, ముఖ్యమంత్రి కేసీఆర్ హ యాంలోనే రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలను గుర్తించి వారస త్వ సంపదను కాపాడుతున్నారు.
ఇందులో భాగంగానే వరంగల్‌లోని రామప్ప దేవాలయానికి, కుతుబ్షాహి టోంబ్స్, హయత్ బక్షికి గుర్తింపు తీసుకువచ్చేలా కృషి చేశారన్నారు. హయత్‌నగర్ డివిజన్ పరిధిలోని హయత్ బక్షీకి గొప్ప పర్యాటక కేంద్రం తీర్చిదిద్దుతామన్నారు. వందేళ్ల క్రితం కట్టడాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా కృషి చేస్తూ, పర్యాకట కేంద్రానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని చెప్పా రు. అనంతరం హయత్ బక్షిలో పర్యటిస్తూ అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. కాగా, మజీద్‌లోని లాన్స్, మొక్కల నిర్వహణ బాధ్యతను జీహెచ్ఎంసీకి అప్పగించాలని కమిటీ సభ్యులు కోరారు. ఇందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
పురాతన కట్టడమైన హయత్ బక్షి అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్త తెలిపారు. చారిత్రక కట్టడాన్ని అభివృద్ధిలో భాగం గా హయత్ బక్షిని రూ.2.50 కోట్లతో పనులు చేపట్టామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేట్ సామ తిరుమల్‌రెడ్డి, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని శ్రీధర్ గౌడ్, గుడాల మల్లేశ్ ముదిరాజ్, టూరిజం శాఖ ఈడీ శంకర్‌రెడ్డి, ఓఎస్డీ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ పం కజ, డీసీ మారుతీ దివాకర్, భాస్కర్ సాగర్, మల్లీశ్వరి, స్కైలా బ్, నగేశ్, రఫీక్, అంజలీ గౌడ్, బాలకృష్ణ యాదవ్, రాకేష్, రవీందర్‌రెడ్డి, హైమద్, బాలూ, గోవర్ధన్, రాజు పాల్గొన్నారు.