
హైదరాబాద్ ఆట ప్రతినిధి డిసెంబర్ 14: క్రీడాకారులంతా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించి ప్రభుత్వం కల్పిస్తున్న రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, క్రీడలు యువజన సర్వీసుల, టూరిజం శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రి తన క్యాంప్ కార్యాలయంలో హైదరాబాద్ ఓపెన్ స్ప్రింట్స్ అండ్ రిలే అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ హాకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ చెందిన క్రీడాకారులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు క్రీడల్లో పాల్గొంటున్న చిన్నారులకు భవిష్యత్తులో భారీ ప్రోత్సాహంతో పాటు ఆర్థిక సహాయ సహకారాలు ఉంటాయన్నారు. హాకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్ అథ్లెటిక్స్ చాంప్లో క్రీడాకారులు 10 స్వర్ణ పతకాలు, 5 రజితాలు, 3 కాంస్య పతకాలు సాధించారు. వారితో పాటు పాఠశాల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణలను క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్, భాస్కరరావులు
అభినందించారు.