కందుకూరు, డిసెంబర్ 14 : రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి బాటలు వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో స్థానిక టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనపై సంపూర్ణ విశ్వాసం ఉంచిన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలను తెలిపారు. ప్రతి పక్షాల చేస్తున్న విమర్శలను తిప్పికొట్టి ఆరు మంది టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా గెలిపించారాని చెప్పారు. ఈ ఫలితాలు తెలంగాణ బంగారు బాటలకు సోపానాలని చెప్పారు. కార్యక్రమంలో రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.